Andhra Pradesh Secretariat Raft Foundation in Amaravati
అమరావతిలో మొత్తం సెక్రటేరియట్ టవర్స్ 5. అందులో 4 టవర్లు 40 అంతస్తులతో ఒక టవర్ 50 అంతస్తులతో శరవేగంగా నిర్మిస్తున్నారు. ఈ 50 అంతస్తులున్న టవర్ లోనే సి.ఎం ఆఫీస్ కూడా ఉంటుంది. పైన హేలిఫ్యాడ్ కూడా ఉంటుంది. క్రిందనున్న వీడియోలో చూడొచ్చు అది రెండవ టవర్ రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి చేసుకుని ఫ్లోర్లు నిర్మాణం జరుగుతుంది. రాఫ్ట్ ఫౌండేషన్ ఎందుకు వేస్తారంటే క్రిందనున్న భూమి బాగా మెతకగా బంకగా ఉన్నప్పుడు 40 ప్లోర్లు వెయ్యాలంటే పిల్లర్లు భూమిలోకి కుంగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్తితుల్లో ప్రత్యామ్నాయ పద్దతే రాఫ్ట్ ఫౌండేషన్. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే క్రింద 10 నుండి 20 అడుగులు గొయ్యి తీసి బాగా మందంగా ఉండే ఊస బిగించి మొత్తం కాంక్రీట్ తో నింపేస్తారు. అంటే క్రింద నేల బండలా అతి దృడంగా మార్చుకున్నాము. ఆ తరువాత ఎన్ని ప్లోర్లు పైకి నిర్మించుకుంటూ పోయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.క్రిందనున్న వీడియో చూసి నచ్చితే షేర్ చెయ్యడం చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు
వీడియో లింక్ - https://www.youtube.com/watch?v=wRzwm19Y1EM
చానల్ లింక్ - https://www.youtube.com/channel/UCCHpdORAfvdbUvNQM5mnXaw
No comments:
Post a Comment